మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందన
- సీఎం పదవికి రాజీనామా చేయనన్న మమత
- మమత ప్రవర్తన నమ్మశక్యంగా లేదన్న వర్మ
- ఇది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమిపాలైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మమత వ్యాఖ్యలపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికి బీజేపీ విజయం సాధించినప్పటికీ, ఆమె రాజీనామాకు నిరాకరించడాన్ని ఆర్జీవీ తీవ్రంగా తప్పుబట్టారు.
"దశాబ్దాల రాజకీయ అనుభవం, 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకురాలు ఇలా ప్రవర్తించడం నమ్మశక్యంగా లేదు. ప్రజాస్వామ్యం అనేది వ్యవస్థల కలయిక అని, అటువంటి వ్యవస్థలను గౌరవించకుండా రాజీనామాకు నిరాకరించడం అంటే నేరుగా ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే" అని ఆర్జీవీ ఎక్స్ వేదికగా స్పందించారు.